![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1065 లో.... పార్టీలో మదన్ ఐస్ క్రీమ్ తింటుంటే స్వాతి వచ్చి లాక్కుంటుంది. మదన్ తన దగ్గర నుంచి లాక్కోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే భ్రమరాంబ శేషు చూసి మురిసిపోతారు. మదన్ తో నా కూతురు ఎలా ఉందోనని భ్రమరాంబ హ్యాపీగా ఫిల్ అవుతుంది. మరొకవైపు పార్టీలో పెద్ద స్క్రీన్ పై రాజు, లక్కీ మాట్లాడుకున్న వీడియోని ఐశ్వర్య ప్లే చేస్తుంది. అందులో ఇందు నేను భార్యాభర్తలం కాదని రాజు చెప్పేది ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు.
ఏంటి ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసావా అని భ్రమరాంబ అడుగుతుంది. లేదు పిన్ని అదంతా అబద్ధమని ఇందు చెప్తుంది. అక్క అబద్ధం చెప్పదని స్వాతి అంటుంది. మేం పెళ్లి చేసుకున్నాం.. ఐశ్వర్య కావాలనే ఇదంతా చేస్తుందని ఇందు చెప్తుంది. అయితే సాక్ష్యం ఏంటని ఐశ్వర్య అడుగుతుంది. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది. మీకు సాక్ష్యం కావాలి కదా ఇదిగోండి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అని నందు ఇస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అవన్నీ ఫేక్ వీడియోస్ ఆంటీ.. ఇప్పుడు ఏఐ ద్వారా అలా చేస్తున్నారని ఇందు అంటుంది. అవును పిన్ని అని రాజు అంటాడు కావాలంటే చూడు అని రేఖని ఐశ్వర్య తిట్టినట్లు ఒక వీడియో చూపిస్తాడు. ఇవన్నీ నమ్మొద్దు ఆంటీ అని రాజు అంటాడు. ఐశ్వర్య ఏదో చెప్పబోతుంటే ఆపమని రేఖ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఇందు, నందు మాట్లాడుకుంటారు. సమయానికి వచ్చి కాపాడావ్ అని ఇందు అనగానే నా గురించి కాదు నానమ్మకి డౌట్ వచ్చినట్లు ఉంది చూడమని నందు చెప్తుంది.
మరొకవైపు రాజు గదిలోకి రాగానే ఎందుకు ఆ లక్కీ గాడితో తాగి వాగవని ఇందు కోప్పడుతుంది. రాజు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. తరువాయి భాగంలో ఇందు దగ్గరికి తన క్లయింట్స్ వచ్చి డీలింగ్ కుదర్చుకుంటారు. మీరు ఒక సంతకం పెట్టండి అని ఇందుకి అతను ఫైల్ ఇస్తాడు. ఇందు సంతకం చేస్తుంటే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |